మిత్రులారా, వందనాలు!
కాంట్రాక్ట్ విధానంలో పారా మెడికల్ హెల్త్ వర్కర్స్ గా పనిచేస్తున్న మనకి గత నవంబర్ నెలలో 18 తారీఖున అప్పటి వైద్య ఆరోగ్య మంత్రిగారు అయిన దానం. నాగేందర్ మనకి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని నెల రోజులైన మన సమస్య మాత్రం ఎక్కడవేసిన గోంగలి అక్కడే అన్నచందంగా మారింది. రాష్ట్రంలో మంత్రివర్గం మారెసరికి మళ్ళి సమస్య మెదటికొచ్చింది. నమ్మించి మోసంచేసిన ప్రభుత్వం మెడలు వంచటానికి మనందరం చేయి చేయి కలపవలసిన సమయం ఆసన్నమైనది. రెగ్యులరైజెషన్ సంగతి దేవుడెరుగు, బడ్జెట్ వచ్చినాకూడా జీతాలు అందక, కనీసం రెన్యువల్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుచున్నాం. ఉన్నపలంగా కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బందినందరిని అబ్జార్బ్ చెయటం కుదరదని ఓ వైపు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి వద్ద నుండి నివేదికలు వెళ్తుంటే, మరోవైపు ఉద్యమాలు చేస్తున్నవారిపై ఉక్కుపాధం మోపుతుంటే ఇంకా ఏదోమంచి జరుగుతుంది అని ఎదురుచూడటం బహుశా వెర్రితనం అవుతుందేమో. ప్రభుత్వ వైకరిని నిరసిస్తు మనకోరికలు సాధించుకోవలసిన సమయం ఆశన్నమైంది. కావున సోదరులారా! ఇటువంటి విపత్కర పరిస్తితులను ఎదుర్కొని మళ్ళి మన ఉద్యమాన్ని నిర్మానాత్మకంగా చేపట్టి ప్రభుత్వం కూలదోయటానికి ప్రయత్నిస్తున్న మన రెగ్యులరైజెషన్ ఇంటిని నిర్మించవలసిన బాద్యత మనందరిపైనవుంది. కావున ప్రియ సహుద్యోగి మనం ఏమిచేయాలి నీకే ఉద్యమం ముందుండి నడిపించె అవకాశంవస్తే నువ్వు ఏమిచేస్తావు నీయెక్క విలువైన ఆలోచన ఇక్కడ పంచుకో. లేదా ఫోన్ ద్వారా తెలియచెయ్. 9701223339.
No comments:
Post a Comment